అంటరానితనం,వివక్షలపై అలుపెరగని పోరాటం
బెంగూళుర్ ,ఇట్స్ ట్రూ న్యూస్:
అంటరానితనం,వివక్షలపై అలుపెరగాని పోరాటం చేసి భారత రాజ్యంగం రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ అని అజీం ప్రేమ్ జీ యూనివర్సిటి ఎకానమిక్ అసిస్టేంట్ ప్రోఫెసర్ దొంత ప్రశాంత్,పెద్దపల్లి జిల్లా మహిళ సాధికారత కో ఆర్డీనేటర్ దయ అరుణ అన్నారు. ప్రోఫెసర్ దంపతులు కలిసి ఆదివారం కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ అజీం ప్రేమ్ జీ యూనివర్సిటి లో ని డాక్టర్ బిఆర్ ఆంబెద్కర్ విగ్రహం కు పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రోఫెసర్ దంపతులు మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి ని ప్రతి ఏటా ఎప్రిల్ 14 న దేశ వ్యాప్తంగ నిర్వహిస్తరని పేర్కొన్నారు.అంబెద్కర్ భారత రాజ్యంగా పితామహుడని అన్నారు.అంబెడ్కర్ 1891 ఎప్రిల్ 14న మధ్య ప్రదేశ మోవ్ లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొందరివాడు ఓ ఒక్క వర్గానికో సొంతం కాదు. ఆయన అందరివాడని అన్నారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టమని తెలిపారు.ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తి రీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కొనియాడారు.పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు కోసం అంబెడ్కర్ పోరాటం సాగించారని అన్నారు.వివాహ వారసత్వం విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం లో తను కీలక పాత్ర పోషించారని అన్నారు.