రామగుండం ఇట్స్ ట్రూ న్యూస్
గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్కవన దేవతలను బుధవారం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగుర్ దర్శించుకొన్నారు.అనంతరం ఎమ్మెల్యే నిలువేత్తు బుట్ట బంగారం ను దేవతలకు సమర్పించుకొని మొక్కులను చెల్లించుకొన్నారు. సమ్మక్క ,సారక్క దేవతల దర్శనార్థం వచ్చే భక్తులకు ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలు ప్రసాదించి, వారి పిల్ల పాపల్ని చల్లంగా చూడు తల్లి అని వనదేవతలను ఎమ్మెల్యే వేడుకొన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా లాగా జరిగే వనదేవతల జాతర నిజంగా చాలా ఆధ్యాత్మికమైన జాతరని అన్నారు.సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం అంటే ప్రకృతి మాత ఆశీర్వచనాలు తీసుకోవడం లాంటిదని తెలిపారు.సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు, కమిటీ వారికి ఆదేశాలు జారీ చేశారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ దంపతులతో పాటు, కార్పొరేటర్లు,జాతర కమిటీ చైర్మన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.