రామగుండం,ఇట్స్ ట్రూ న్యూస్:
గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.వన దేవతల దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు.సారలమ్మ తో పాటు గోవింద రాజు,పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరడంతో జాతర మొదటి దశ పూర్తైయింది.నేడు సమ్మక్క ను కోయ పూజరులు గద్దె వద్ద కు తీసుకవచ్చి ప్రతిష్టచేస్తారు.శనివారం జాతర ముగియడంతో వన దేవతలు వనంలోకి వెళ్ళ నున్నారు,దీంతో జాతర ముగిస్తుంది.