రామగుండం నియోజకవర్గంలో ఓటర్ శాతం పెంచాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రానున్న పార్టమెంట్ ఎన్నికల్లో ఈసారి రామగుండం నియోజక వర్గంలో ఓటర్ శాతం పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు.శనివారం ఎన్టీపీసీ టిటిఎస్ లోని మిలినియంలో హాల్ లో స్వీప్ సమీక్షా సమావేశం నిర్వహంచారు.ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు ఓటు హక్కు ను వినియోగించుకోవాలని అన్నారు.18ఏళ్ళు నిండి వారు నూతన ఓటర్ నమోద్ చేసుకోవాలని తెలిపారు.బిఎల్ వోలకు,సూపర్ వైజర్లు,డిగ్రీ.పిజీ మెడికల్ ,ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్స్ కు స్వీప్ యాక్షన్ ప్లాన్ గురించి విరించారు.కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్,తహశీల్దార్లు కుమార స్వామి,రామ్మోహన్,ఎంపిడీవోస్ అలీం,శశికళ తది తరులు ఉన్నారు.