రైతన్నలను తుపాకి లతో కాల్చి చంపడాన్ని ఖండించండి పిలుపు
జ్యోతినగర్/ఇట్స్ ట్రూ న్యూస్
దేశానికి అన్నం పెట్టే రైతన్నలను తుపాకి తూటాలతో కాల్చి చంపడాన్ని ఖండించండని ఐఎఫ్టుయూ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ,పిఎస్ కెఎస్ (ఐఎఫ్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ పిలుపునిచ్చారు.భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) జాతీయ కమిటి పిలుమేరకు శనివారం రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ లో నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సంపదను, సహజ వనరులను,ఆస్తులను ఆదానీ, అంబానీ లకు దోచిపెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వం, ఆరుకాలం రెక్కలను ముక్కలు చేసి కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదా అని ప్రశ్నించారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలు ఉత్త ముచ్చటేనా అని ఎద్దేవా చేశారు. రైతే దేశానికి వెన్నముక్క అంటూనే రైతు వెన్నులో తూటాలు దించిన హంతక మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. రైతులపై కాల్పులకు అదేశాలిచ్చిన హర్యానా ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి,సీఎం, హోం మినిస్టర్ లపై హత్యానేరం కేసు నమోదు చేయాలని,విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 23 ఏండ్ల యువ రైతు శుభకరన్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.దేశ ప్రజలకు మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వెంటనే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ (ఎం ఎస్ పి) చట్టం చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొన్నారు. కార్మిక కొత్త చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఐ ఎఫ్ టీ యు జిల్లా నాయకులు బి బుచ్చన్న,ఎడ్ల రవి కుమార్,డి రాజేశం, కె రాజేశం, వసంత్,కే మహేందర్,మర్రి శ్రావణ్, పీ శ్రీకాంత్, నరసయ్య, శోభన్ బాబు,వెంకటేష్ గుండు రాజన్న, బి తిరుపతి రెడ్డి, అనిల్, సతీష్, టీ రాజు,జే కృష్ణ, మనోహర్. తదితరులుపాల్గొన్నారు.