రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు స్టూడెంట్ ఎంపిక

Written by itstruenews.com

Published on:

 

 

 

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు స్టూడెంట్ ఎంపిక

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్ :

స్కూల్ గేమ్ ఫేడరేషన్ (ఎస్ జీఎఫ్) 67వ రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని సెయింట్ క్లేర్ స్కూల్ స్టూడెంట్ రాంచర్ల అశ్రీత్ ఎంపికైనట్లుపెద్దపల్లి జిల్లా ఎస్ జీఎఫ్ ఆర్గనైజర్ సెక్రటరీ కొమ్ము గట్టయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.గత డిసెంబర్14న సెంటినరి కాలని లో జరిగిన జిల్లా స్థాయిలో క్రీకెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యాడని చెప్పారు. ఈనెల 26 నుంచి 29 వరకు జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లాలలో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు అశ్రిత్ ఎంపిక కావడంతో స్కూల్ హెచ్ఎం ఫాధర్ డామ్నిక్ హర్షం వ్యక్తం చేశారు.పీఈటీ సుదేష్,శ్యాం,టీచర్స్ స్టూడెంట్ ను అభి నందించారు.

Leave a comment