మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
జ్యోతినగర్,/ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలోని ప్రగతి నగర్ కు చెందిన పస్తం అశోక్ (27 )మద్యానికి బానిసై శనివారం సాయంత్రం రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఎన్టీపీసీ పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి పెళ్లి అయ్యింది, మనస్పర్దాలు వచ్చి భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారని పేర్కొన్నారు. వారికి 4సంవత్సరాల కూతురు ఉందన్నారు.ఇద్దరు విడివిడిగా ఉండటంతో మృతుడు త్రాగుడు కు బానిసైనాడు.దీంతో మద్యం మత్తులో చైతన్య పురి కాలని వద్ద ట్రైన్ కింద పడి అశోక్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు సోదరుడు సారయ్య పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.