ఓటు హక్కు వజ్రాయుధం
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు,ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ ట్రీనిటి డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ కు ఓటు హక్కూ పై అవగహన కల్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిదని తెలిపారు.ఓటు హక్కే పదునైన అస్త్రం18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ను వినియోగించుకోవాలన్నారు.కొత్త ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోందని అన్నారు. తొలిసారి ఓటు వేసి ప్రజా స్వామ్యంలో రాజ్యంలో ఓ వినూత్న అనుభవానికి శ్రీకారం చుట్టాలనుకున్న యువతకు ఓటు హక్కు వజ్రాయుధమని వివరించారు. యువతీ యువకులకు ఓటు హక్కును పదునైన అస్త్రంగా మలుచుకుని రాజకీయాల్లో సమూల మార్పులకు నాంది పలికే అద్బుతమై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ వైపి తెలంగాణా స్టేట్ ప్రెసిడెంట్ కె యాదవరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ,కళాశాల ప్రిన్సిపాల్ యుగేందర్,ఎన్ ఎస్ఎస్ పివో తాజోద్దిన్,ప్రోగ్రాం ఆర్గనైజర్ సంకల్పా ప్రెసిడెంట్ సాయి శ్రీ,స్టూడెంట్స్ తది తరులు ఉన్నారు.