విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపోందించాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం ఎన్టీపీసీ టిటిఎస్ లోని జెడ్పీ హైస్కూల్లో బుధవారం నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి , జెడ్పీ హైస్కూల్ ప్రిన్సిపాల్ జయరాజు హాజరై మాట్లాడారు.స్టూడెంట్స్ లో సృజనాత్మకతను వెలికి తీసెందుకు సైన్స్ కాంపీటిషన్ ప్రోగ్రామ్స్ ఎంతో దోహదపడతాయన్నారు.ప్రతి విద్యార్థి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపోందించుకోవాలని అన్నారు.విద్యార్థి దశ నుంచి శాస్త్రీయ పరిజ్ఞానంపై మక్కువ కలిగి ఉంటే భవిష్యతులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.స్టూడెంట్స్ సైన్స్ పట్ల మక్కువ చూపటేట్లు టీచర్స్ అవకాశాలు కల్పించి, ప్రోత్సహించాలన్నారు.అనంతరం స్టూడెంట్స్ తయారు చేసిన సైన్స్ ప్రయోగాల ప్రదర్శనలు చూసి అభినందించారు.కార్యక్రమంలో,టీచర్స్ అంజన్ కుమార్, శ్రీధర్ ,స్వర్ణలత, అనురాధ , నీలం రాణి,కేడం శ్రీను, తిరుపతి, కొమ్మురోజు శ్రీనివాస్, తది తరులు ఉన్నారు.
: