మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన మల్లేష్
జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం మున్సిపల్ నూతన కమిషనర్ శ్రీకాంత్ ను మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదూ నూరి మల్లేష్ సన్మానించారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి గురువారం మొదటిసారిగా మేడిపల్లి గ్రామానికి,సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా సన్మానించినట్లు పేర్కొన్నారు.గత పాలకుల చేతిలో మేడిపల్లి గ్రామాము అభివృద్ధి కి నోచుకోలేదని ఇప్పుడైనా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మల్లేష్ కోరారు. రోడ్డు వెంట వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ను అభ్యర్థించారు.