ఎస్సీ జాతీయ కమీషన్ మెంబర్ కు సన్మానం
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మెంబర్( జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్) గా నూతనంగా నియమితులైన వడ్డేపల్లి రాంచందర్ ను శనివారం ఎన్టీపీసీ సివిల్ సూపర్ వైజర్ రామగిరి ప్రకాష్ పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో ఘనంగ సన్మానించారు.ఈ సంర్బంగా ప్రకాష్ మాట్లాడుతూ..రాంచందర్ ఎన్టీపీసీ లో ఉద్యోగం చేస్తు గోదావరిఖని,ఎన్టీపీసీ,రామగుండం ప్రాంతంలో గత 40 ఎళ్ళుగా ఎబివిపి నుంచి బిజెపి లో కీలక వ్యక్తిగా ఎదిగి పార్టీ బలోపేతం కు కృషి చేశారని అన్నారు.బిఎంఎస్ లోఎన్నో పదవులు అదిరోహించి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు.ఎసి సి కులాల్లో ఉన్న వారికి ఎన్నో సేవలు చేసి దిక్చూచి అయ్యాడని కొనియ్యాడారు.ఎస్ సి కూలాల అభ్యున్నతికి కృషి చేస్తు వారికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.