మహిళ అభ్యున్నతే ధ్యేయంగా మహిళా సంక్షేమ సంఘం సాగుతుంది

Written by itstruenews.com

Published on:

 

 

 

మహిళ అభ్యున్నతే ధ్యేయంగా మహిళా సంక్షేమ సంఘం సాగుతుంది..

ఇట్స్ ట్రూ న్యూస్,గోదావరిఖని:

మహిళల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంక్షేమ సంఘం ముందుకు సాగుతుందన్నారు మహిళ సంక్షేమ సంఘం సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ సంక్షేమ సంఘం సంఘం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం గోదావరిఖని మార్కండేయ కాలనీ ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమంలో, అభ్యున్నతిలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మహిళలు అంటే మగ వారి ఉన్నతంలో ఓ తల్లి, చెల్లె, స్నేహితురాలు, భార్యగా ప్రతి ఒక్కరి ఉన్న స్థాయికి ఎదిగేందుకు దోహద పడతారాన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పొరండ్ల శారద, మహిళా నాయకురాల్లు మాటేటి మౌనిక, రేణుక, విజయ, లలిత శ్రీ, రజిత, శోభ, రాజేశ్వరి, ఆలియ, మల్లేశ్వరి తో మహిళా శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment