మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు జారీ

Written by itstruenews.com

Published on:

 

మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు జారీ

ఇట్స్ ట్రూ న్యూస్ ,జ్యోతినగర్:

ఫిబ్రవరి 6వ తేదిన ఎన్టీపీసీ లక్ష్మీనరసింహ గార్డెన్ లో బిఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ,రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ న్యాకత్వంలో బిఆర్ ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది.దీనిలో భాగంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి దిష్టి బోమ్మను దహనం చేశారు.ఈ మేరకు ఎన్టీపీసీ పోలీసులు సోమవారం కోరుకంటి చందర్ , కుమ్మరి శ్రీనివాస్ ఈదునూరి శంకర్, ఈదునూరి పర్వతాలు, కృష్ణవేణి, పగడపల్లి నారాయణ, గఫార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, అచ్చ వేణు, బుల్లెట్ శీను, జావిద్ పాష, భాషాంపల్లి శ్రీనివాస్, మూల విజయ రెడ్డి అయిత శివకుమార్ శ్రావణ్ కు ఎన్టీపీసీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్టీపీసీ టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మెరుగు లింగయ్య ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్ ఐ టి. ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు మిగతా నిందితులు అందరికీ 41-ఎ సిఆర్ పిసి కింద నోటీస్ లు జారీ చేసినట్లు తెలిపారు

Leave a comment