ఉద్యోగుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తా

Written by itstruenews.com

Published on:

                                                          ఇట్స్ ట్రూ న్యూస్:

ఉద్యోగుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తా

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:

ఎన్టీపీసీ లో ఉద్యోగులు,కార్మికుల ప్రయోజనాలకోసం ఉద్యమిస్తానని ఐఎన్టీయూసి జాతీయ కార్యదర్శి,ఎన్టీపీసీ ఉద్యోగుల ఫేడరెషన్ జాతీయ అధ్యక్షుడు బాబర్ సలీం పాష అన్నారు.శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని ఆ యూనియన్ అనుబంధ మజ్దూర్ యూనియన్ ఆఫీసులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర,జాతీయ స్థాయిలోని ట్రేడ్ యూనియన్ల ను కలుపుకొని పోయి ఉద్యోగుల,కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.మీరందరి సహకారంతోనె జాతీయ స్థాయి నాయుకుడిగా ఎదిగనని పేర్కొన్నారు.డబ్ల్యూ 4,5 ఉద్యోగుల 5 సంవత్సరాల ప్రమోషన్ పాలసీ ఇంక్రిమెంట్3సంవత్సరాలకు తగ్గించాలి,అలాగే ఎస్ ఎల్ పిఎస్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వాలని అన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన ఎన్టీపీసీ ఉద్యోగుల ఫేడరేషన్ జాతీయ అధ్యక్షుడు బాబార్ సలీం పాష కు మజ్దూర్ యూనియన్ నాయకులు పుష్పగుచ్ఛం అందించి శాలువతో ఘనంగా సన్మానించారు.చిన్న స్థాయి నుంచి ఎదిగిన బాబర్ సలీం పాషను ప్రతి యూనియన్ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కాసర్ల వేంకటస్వామి,జనరల్ సెక్రటరీ బండారి కనుకయ్య,యూనియన్ నాయకులు కందుల స్వామి,ఆరపల్లి రాజేశ్వర్,దేవరాజుల రవి తది తరులు పాల్గొన్నారు.

Leave a comment