ఇట్స్ ట్రూ న్యూస్
-
- కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా జనక్ ప్రసాద్
ఇట్స్ ట్రూ న్యూస్/. పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): పోరాట యోధుడు సింగరేణి కార్మికుల ముద్దుబిడ్డ సాజక్ ద్వారా లక్షాధి కార్మికులకు ప్రయోజనం కలిగించిన జనక్ ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా నియమించారు. మందమర్రి కి చెందిన జనక్ ప్రసాద్ 1989 నుంచి కార్మిక రంగంలో చురుకైన పాత్ర పోషించారు. సికాస విజృంభిస్తున్న రోజుల్లో సాజక్ ద్వారా కార్మికుల సమస్యలను అనేకం పరిష్కరించారు. చక్కటి వాగ్దాటి తొ ప్రపంచ ఆర్థిక విధానాల పట్ల కార్మిక రంగం పట్ల అవగాహన కలిగిన జనక్ ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో సముచిత స్థానం కల్పించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి పోటీ చేయాలని ఆయన భావించినప్పటికీ టికెట్ లభించలేదు. పార్టీ కి కట్టుబడి ఉండే నాయకుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. ఇటీవల సింగరేణిలో జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఆరు డివిజన్లలో ఆయన యూనియన్ను గెలిపించగలిగారు. గతంలో ఐఎన్టీయూసీలో ఉండే వెంకట్రావు జనప్రసాద్ సమఉజ్జీలుగా యూనియన్ నడిపించి 2004లో గుర్తింపు యూనియన్ గా గెలుపొందారు. ఆ దశలో వెంకట్రావు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ఆ తర్వాత పార్టీ మారిన వెంకట్రావు తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం లో చేరగా ఐ ఎన్ టి యు సి నీ జనక్ ప్రసాద్ ఒంటిచేత్తో నడిపించారు. సింగరేణి కార్మికుల వేతన ఒప్పంద బోర్డులో ఆయన శాశ్వత మెంబర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు గుర్తింపు ఇచ్చి మినిమం వెజ్ బోర్డ్ చైర్మన్ గా నియమించింది. 2004లో సైతం ఎన్టిపిసిలో ఐఎన్టీయూసీ అగ్ర నాయకుడు బాబర్ సలీం భాష కూడా మూడు సంవత్సరాల పాటు మినిమం వెరీ బోర్డ్ చైర్మన్ గా పనిచేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను నియమించారు. జన ప్రసాదు కు మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ రావడం పట్ల బాబర్ సలీం పాషా బండారి కనకయ్య వంగ లక్ష్మీపతి గౌడ్ నరసింహారెడ్డి పూసాల తిరుపతి కిషన్ నాయక్ ఎట్టం కృష్ణ మామిడాల చంద్రమౌళి మంథని నరేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.