చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన
జ్యోతి నగర్,/ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత దిశగా పయనిస్తుంది. స్వచ్ఛ కార్పొరేషన్ తీర్చిదిద్దడంలో భాగంగా చెత్త సేకరణపై అ ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు.స్వచ్చ సర్వేక్షణ్ లో భాగాంగ శనివారం 23వ డివిజన్ అటోనగర్ లో ఇంటింటా తిరిగి తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి మొక్కలకు ఉపయోగించవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా తిరిగి ఉపయోగించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్పొరేషన్ సిబ్బంది సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి షెడ్డులోని కంపార్టుమెంట్‌లో వేసి దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చి హరితహారంలో పెంచుతున్న మొక్కలకు వినియోగిస్తున్నారని చెప్పారు.చెత్త బండి వచ్చినప్పు చెత్త వేయకుండ కాలువలో చెత్త వేయడం ద్వారా దుర్వాసన వేదజల్లి రోగాలు ,దోమలు వచ్చే అవకాశం ఉందన్నారు.కాలువలో చెత్త వేయడం ద్వారా కాలువలో చెత్త పేరుకపోయి వర్షాకాలంలో వర్షాలు పడి వరదలు వచ్చే ప్రమాదముందన్నారు.చెత్త బండి లో చెత్త వేయాకుండ కాలువలో వేస్తే జరిమాన విధిస్తామని తెలిపారు.కార్యక్రమంలో శానిటేషన్ ఇన్ స్పెక్టర్ శ్యాం సుందర్,సూపర్ వైజర్ సంపత్ ఆర్ పీ లు,పారిశుద్ద కార్మికులు తది తరులు ఉన్నారు.