జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ను సన్మానించిన రేవా సంఘం

Written by itstruenews.com

Published on:

 

జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ ను సన్మానించిన రేవా సంఘం

ఇట్స్ ట్రూ న్యూస్/ జ్యోతినగర్

జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రాంచందర్ ను రామగుండం ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం (రేవా)నాయకులు ఆదివారం టౌన్ షిప్ లోని జ్యోతిభవన్ లో పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయనకు పలు సమస్యల పై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం ప్రెసిడెంట్ ఆకుల రాంకిషన్ మాట్లాడుతూ…ఎన్టీపీసీ విశ్రాంతి ఉద్యోగులకు టౌన్ షిప్ లో ఆఫీసు వసతి కల్పించాలని కోరమన్నారు. ప్రస్తుతమున్న విశ్రాంత ఉద్యోగుల ‘పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ (పిఆర్ ఎంఎస్)స్కీం’ 2017 రివైజుడ్ పే స్కేలు ప్రకారం ఇవ్వాలని ఎన్టీపీసీ కార్పొరేట్ యాజమాన్యం ఢిల్లీ వారిపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.డిఎ తో కూడిన పెన్షన్ వచ్చే ల కేంద్ర ప్రభుత్వం ను ఒప్పించి విశ్రాంతి ఉద్యోగలకు న్యాయం చేయలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రివైజుడ్ స్కేల్ పై ఈపి ఎఫ్ వో ద్వారా ఈపిఎస్ 95 పెన్షన్లు సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించి కోరడమైనందని తెలిపారు.కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (రేవా) అధ్యక్షులు శ్రీ ఆకుల రాంకిషన్, ప్రధాన కార్యదర్శి సత్తు ముత్యాలు,చీఫ్ వైస్ ప్రసిడెంట్ తిరుమల సురేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు దుర్గం నర్సయ్య, దేవ లాలయ్య, సంయుక్త కార్యదర్షులు చెప్యాల శ్రీపతి రావు, ఈ. వెంకటేశ్వర్లు, బుర్ర రాజయ్య గౌడ్ తది తరులు ఉన్నారు

Leave a comment