ఉద్యోగ విరమణ కార్మికులకు సన్మానం

Written by itstruenews.com

Published on:

 

ఉద్యోగ విరమణ కార్మికులకు సన్మానం

జ్యోతినగర్/ ఇట్స్ ట్రూ న్యూస్:

న్టిపిసి రామగుండం ప్రాజెక్టు హార్టికల్చర్ విభాగంలో గత 35 సంవత్సరాలు గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న కే అంజమ్మ, ఏ రంగమ్మ ను కార్మికులను ఘనంగా సన్మానించారు. శనివారం ప్లాంట్ లోని హార్టికల్చర్ విభాగంలో విధులు నిర్వహి స్తున్న అంజమ్మ, రంగమ్మ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్ సన్మానించారు.శంకర్ మాట్లాడుతూ….. హార్టీ కల్చర్ లో పూల మొక్కల ను, పార్క్ లను పెంచి ఎన్టిపిసి ని అందంగా తీర్చిదిద్దారు అని అన్నారు. లొకేషన్ లో పని చేస్తూ క్రమ శిక్షణ కార్మికు రాలుగా పేరు తెచ్చుకొన్న వారిని తోటి కార్మికులు అనుసరించిలని తెలిపారు. కార్మికుల సమస్యలు ఐ ఎ ఫు టు యు తో నే సాధ్యమవుతాయని అన్నారు. కార్యక్రమంలో టి లక్ష్మి, శోభక్క, లక్ష్మి, సత్యమ్మ, మల్లయ్య,స్వరుపం, ఐలయ్య, పర్వతాలు, భూమయ్యల తో పాటు పలువురు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment