సింగరేణికి దక్కిన గౌరవం

Written by itstruenews.com

Published on:

 

 

 

 

 

సింగరేణికి దక్కిన గౌరవం

 

గోదావరిఖని, ఇట్స్  ట్రూ న్యూస్ 

సింగరేణి బొగ్గు పరిశ్రమ ఉద్యోగి బిడ్డ వడ్డేపల్లి రామచందర్ కు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియామకం కావటం గని కార్మికులకు గర్వకారణమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీపీసీలో వడ్డేపల్లి రామచందర్   ను టిబిజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలో పనిచేసే దళితులకు రోస్టర్ విధానము, రిజర్వేషన్ పాలసీ సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులను ఆదేశించాలని కోరారు. రామచందర్ తండ్రి స్వర్గీయ లింగయ్య గోదావరిఖని ఒకటవ గనిలో పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాధారణ కార్మిక కుటుంబం నుండి జాతీయ నాయకుడిగా ఎదిగి నిలబడటం వడ్డేపల్లి రామచందర్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment