కార్మికుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలి

Written by itstruenews.com

Published on:

  • కార్మికుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలి

జ్యోతి నగర్ ;ఇట్స్ ట్రూ న్యూస్:

దేశంలో నూతన ప్రజా స్వామ్య విప్లం విజయవంతం కోసం పోరాడుతూ అమరులైన వారందరినీ ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిని నింపుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతి రావు అన్నారు.భూమి భుక్తి దేశ్ విముక్తికై అసువులు బాసిన అమరులకు స్మరిస్తూ ఆదివారం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అధ్యక్షతన సంస్మరణ సభ ను ఎన్టీపీసీ ఐ ఎఫ్ టి యూ ఆఫీసు లో నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం మతోన్మాద కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని వర్గ పోరాటాలతో నిర్మించినప్పుడు మాత్రమే అమరులకు నిజమైన నివాలులైన అన్నారు. సభలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ క్రిష్ణ, జిల్లా అధ్యక్షులు ఇ నరేష్, ఇ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బి అశోక్, పి సి కె ఎస్ జిల్లా కార్యదర్శి చిలుక శంకర్, పి ఓ డిబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జ్యోతి, అరుణోదయ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న, అఖిలభారత రైతు-కూలీ సంఘం అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కె లింగమూర్తి, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి ఆరుమూళ్ళ తిరుపతి
తదితరులు ప్రసంగించారు. అనంతరం సభలో అమరవీరుల ను స్మరిస్తూ అరుణోదయ కళాకారులు అమరవీరుల గేయాలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో బి బుచ్చయ్య, ఎం దుర్గన్న, కె మొగిలి, ఎం కొమరయ్య,ఎడ్ల రవికుమార్, బి కొమురయ్య, ఆర్ రాయమల్లు, పుష్పక దేవయ్య,బొంతు ఆనంద్, పైడిపల్లి రమేష్, గొట్టె శంకర్, వేల్పుల సాంబయ్య, కలువల మహెందర్, పి వెంకటస్వామి, డి బుచ్చమ్మ, ఇ బాబు, కె వెంకటస్వామి, ఎస్ రవి, సుధాకర్, ఎస్ రాయ మల్లమ్మ, పి లక్ష్మి, స్వరూప, మంగ.తదితర మొత్తం 300 మంది పాల్గొన్నారు.

Leave a comment