టెంపుల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సహకరించాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
ఎన్టీపీసీ క్రిష్ణ నగర్ లోని మహిళ భక్తుల కోరిక మేరకు శివ కేశవ టెంపుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించ నున్న టెంపుల్ నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్ సహకించాలని ట్రస్టు సభ్యులు కోరారు.మంగళవారం ఎన్టీపీసీ క్రిష్ణ నగర్ ట్రస్టు స్థలంలో జరిగిన మీడియా సమవేశంలో వారు పాల్గొని మాట్లాడారు.క్రిష్ణ నగర్ లో ఇతర మతస్థులు ఇండ్ల మధ్యలో ప్రార్థన మందిరాలు నిర్మించుకొని ప్రార్థన లు చేసుకొంటున్న వారి మతాలకు గౌరవం ఇచ్చి ఏనాడు అడ్డు చేప్పలేదన్నారు.తొగరి శ్రీనివాసు ట్రస్టు సభ్యుల పై పెట్రోల్ చల్లి భయ బ్రాంతులకు గురి చేసి అనవసర రాద్ధంతం తో టెంపుల్ నిర్మాణం ను అడ్డుకోవడం అన్యాయమన్నారు.ఏప్రాంతంకు వెళ్ళిన ఇండ్లను ఆనుకొని ఎన్నో టెంపుల్స్ ఉన్నాయని తెలిపారు.టెంపుల్స్ ఇండ్ల మద్యలో ఉంటాయి ఊరి అవతల ఉండవని అన్నారు.హిందూవుల మనోభావాలను గౌరవించి శాతియుత వాతవరణంలో టెంపులు నిర్మాణంకు ప్రతి ఒక్కరు సహకించాలని విజ్ఞప్తి చేశారు.టెంపులు నిర్మాణం వల్ల శ్రీనివాసు కు ఏదైన దోషం కలుగుతుందని బావణ కలిగితే సమస్య పరిష్కరాం కు సహకిరిస్తామని అన్నారు.కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఎన్ వి సాగర్ రావు,మినిష్ టాండన్,వెంకట్ రెడ్డి,చతుర్బుజా దేవడా,మధుసుధన్ రెడ్డి,రామక్రిష్ణ రెడ్డి,ధశరథం,శ్యాం సుందర్,చంద్ర గౌడ్,శరత్,మోహన్,తిరుపతి రెడ్డి,నరసింహరావు,సాగి చైతన్య రావు,విజయ,సత్యవతి తది తరులు ఉన్నారు.