సిపిఎం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయండి

Written by itstruenews.com

Published on:

సిపిఎం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం

చేయండి

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్

ఈ నెల 23,24వ తేదీలలో ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీలోని కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రాంగణం (శ్రీ లక్ష్మీ కేశవ ఫంక్షన్ హాల్) లో జరగనున్నా సిపిఎం జిల్లా మూడవ మహాసభలకు కార్మికులు,ప్రజలు హాజరై జయప్రదం చేయండని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ,సంఘం గౌరవాధ్యక్షులు వై యాకయ్య పిలుపునిచ్చారు.మంగళవారం ఎన్టిపిసి అన్నం పూర్ణ కాలనీలోని సిఐటియు ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వంద పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లను పూర్తిచేయాలని, గోదావరిఖని జిఎం ఆఫీసు నుండి బి పవర్ హౌస్ గడ్డ వరకు ఫ్లై ఓవర్ ను నిర్మించాలని అన్నారు. స్థానిక పరిశ్రమలలో స్థానికులకే 90శాతం ఉద్యోగవకశాలు కల్పించలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని, పెద్దపల్లిలో అంబేద్కర్ స్టడీ సెంటర్ ను నిర్మించాలని, పెద్దపల్లిలో కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను పేదలకు వెంటనే పంచాలని,కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బి కేటగిరి సిటీగా మార్చడం వల్ల స్థానికంగా కార్మికుల, ఉద్యోగులు తదితరులకు జీతభత్యాలలో ప్రయోజనం చేకూరుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ మహాసభలో భాగంగా 23న వేలాది మందితో ఎన్టిపిసి గేట్ నెంబర్ 2 నుంచి అన్నపూర్ణ కాలనీ మీదుగా మేడిపల్లి సెంటర్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ మహాసభలకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, టి జ్యోతి రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నాంసాని శంకర్, ప్రధాన కార్యదర్శి ఏం రామాచారి, కోశాధికారి ఎన్ బిక్షపతి, చీఫ్ పాట్రన్స్ ఏ ముత్యంరావు, గీట్ల లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు తుంగపిండి మల్లేష్ నాయకులు టి రవీందర్ ఎం సాంబయ్య తది తరులు పాల్గొన్నారు.

Leave a comment