ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు 

Written by itstruenews.com

Published on:

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్:

రామగుండం ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు  సోనియా గాంధీ 78వ జన్మ దిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఘనంగా నిర్వహించారు.సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి,కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసీఫ్ పాషా మాట్లాడుతూ..పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ఆకాంక్ష లను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన దేవత అని కొనియాడారు.సి ఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం బట్టి విక్ర మార్క, ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబు,ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆశయాలకు అనుగుణంగా రామగుండం నియెజక వర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరిన్ని విద్యుత్,ఇతర ప్రాజెక్టు లు రావడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువత కు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి అన్నారు.ఈ ప్రాంత అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడి పల్లి మల్లేష్,మెరుగు లింగ మూర్తి, ఆడేపు రాజేశం, మడిపల్లి మల్లేష్, ఇదునూరి మల్లేష్,భారత్ గౌడ్,కుసుమ వెంకటేష్,తిరుపతి యాదవ్,కిషన్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

Leave a comment