ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం మరిన్ని విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది అయిన ప్రభావిత గ్రామాల అభివృద్దిని ఎన్టీపీసీ యాజమాన్యం మరిచిందని ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసీఫ్ పాష ఆరోపించారు. ఇప్పటికైన యాజమాన్యం ప్రభావిత గ్రామాలలో మౌళిక సదుపాయలు కల్పించాలని అన్నారు.గురువారం ఎన్టీపీసీ క్రిష్ణనగర్ లోని ఒక ప్రవేట్ లాడ్జీ ప్రాంగణంలో జరిగిన మీడియ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..ఎన్టీపీసీ లాభాల్లో కూడ ఈ ప్రాంత అభివృద్దికి ఖర్చు చేయాలని చెప్పారు.నూతన విద్యుత్ ప్రాజెక్ట్ లలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు.ఈ నెల 19వ తేదిన జరిగే పబ్లిక్ హియరింగ్ లోపు ఈ ప్రాంత అభివృద్ది కోసం 1000కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రకటన చేయలని డిమాండ్ చేశారు.ఎన్టీపీసీ రెండో విద్యుత్ ప్రాజెక్ట్ రావడానికి మంత్రి శ్రీధర్ బాబు,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కృషి వుందన్నారు.విద్యుత్ ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి అవుతున్న తరుణంలో ఈ ప్రాంతం కాలుష్యమవుతుంది, ప్రజల ఆరోగ్యాలు,మౌలిక వసతుల కల్పించడం ఎన్టీపీసీ బాధ్యత అన్నారు. ప్రభావిత గ్రామాలైన ఫ్లోరైడ్ ప్రాంతంలో ఆర్ వో ఆర్ ప్లాంట్ లను ఎన్టీపీసీ యాజమన్యం నిర్మించి మేంటెనెన్సు చేయలేక నిరుపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్,బెంద్రం రాజీరెడ్డి,మోరుగు లింగమూర్తి,ఈదునూరి మల్లేష్,భరత్ గౌడ్ తది తరులు ఉన్నారు.