ఎఎల్ సీ నీ నియమించండని వినతి

Written by itstruenews.com

Published on:

 

 

 

  1. ఎఎల్ సీ నీ నియమించండని వినతి

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్

రామగుండం ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ఎఎల్ సీ) ను నియమించండని ఐఎఫ్ టీయూ నాయకులు శుక్రవారం హైదరాబాద్ లో రీజనల్ లేబర్ కమిషనర్ సునిల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇక్కడ పనిచేసిన ఎ ఎల్సీ బదీలిపై వేరోచోటికి వెళ్ళారు. ఇన్చార్జ్ ను నియమించిన ఆ ఆధికారి ఇక్కడకి రాలేదన ఆరోపించారు.రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వివిధ సెక్టారులకు చెందిన కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏడాది అయిన ఎఎల్ సీ ఈ ప్రాంతంలో లేకపోవడం కార్మిక సంఘాలు ఇబ్బందులను ఎదుర్కోంటున్నాయాని తెలిపారు. హైదరాబాద్ వెళ్లి రావడం ఖర్చులతో కూడుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాంలో ఏ ఎల్ సి ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్ టీ యూ అనుబంధ టి జి ఎల్బికే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ ,పి సి కె ఎస్ ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్,నాయకులు రామ్ శ్రీకాంత్, ఐ శ్రావణ్, కే రూపేష్, ఎం తిరుపతి, ఏ రాకేష్, బి సంతోష్ పాల్గొన్నారు

Leave a comment