అంటరానితనం,వివక్షలపై అలుపెరగని పోరాటం

Written by itstruenews.com

Published on:

 

 

 

 

 

అంటరానితనం,వివక్షలపై అలుపెరగని పోరాటం

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:

అంటరానితనం,వివక్షలపై అలుపెరగాని పోరాటం చేసి భారత రాజ్యంగం రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ అని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఎక్స్ క్యూటీవ్ డైరెక్టర్( ఈడీ) కేదార్ రంజన్ పాండు అన్నారు.ఆదివారం డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134 వ జయంతిని టౌన్ షిప్ లోని అంబెడ్కర్ పార్క్ లో ఘనంగా నిర్వహించారు.పార్క్ లోని ఆయన విగ్రంహం కు ఈడీ పూల మాల వేసి నివాళులర్పించారు.ముందుగా ఎన్టీపీసీ ఉద్యోగ ఎస్సీ ఎస్టీ వేల్ఫర్ యూనియన్ నాయకులు ఎఫ్ సిఐ క్రాస్ రోడ్డులోని అంబెడ్కర్ విగ్రహం కు పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం టౌన్ షిప్ గేట్ నుంచి పార్క్ వరకు పాదయాత్ర చేసి అంబెడ్కర్ విగ్రహంకు పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఈడీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి ని ప్రతి ఏటా ఎప్రిల్ 14 న దేశ వ్యాప్తంగ నిర్వహిస్తరని పేర్కొన్నారు.అంబెద్కర్ భారత రాజ్యంగా పితామహుడని అన్నారు.అంబెడ్కర్ 1891 ఎప్రిల్ 14న మధ్య ప్రదేశ మోవ్ లో ఒక దళిత మహర్ కుటుంబంలో జన్మించారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొందరివాడు ఓ ఒక్క వర్గానికో సొంతం కాదు. ఆయన అందరివాడని అన్నారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టమని తెలిపారు.ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ మంత్రి, జాతీయోద్యమంలో తొలి దళిత నేత, వృత్తి రీత్యా లాయరు, బౌద్ధుడు, తత్వవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థికవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కొనియాడారు.పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు కోసం అంబెడ్కర్ పోరాటం సాగించారని అన్నారు.వివాహ వారసత్వం విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం లో తను కీలక పాత్ర పోషించారని అన్నారు.కార్యక్రమంలో ఎన్టీపీసీ హెచ్ ఆర్ ఎజీఎం విజయ్ కుమార్ సిగ్ధర్, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి,ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాష,  ఎన్టీపీసీ ఎస్సీ,ఎస్టీ వేల్ఫర్ యూనియన్ ప్రెసిడెంట్ నవనీత్ రాజ్,సెక్రటరీ మహేంద్ర కోర్రి,కోశాధికారి బాదె అంజయ్య,మజ్దూర్ యూనియన్ నాయకులు ఆరపల్లి రాజేశ్వర్,వేముల క్రిష్టయ్య,తది తరులు ఉన్నారు.

Leave a comment