తబితా అశ్రమంకు స్వెటర్లు పంపిణి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపార వేత్త అనిత క్రాంతి కుమార్ కూతురు కృతి నందన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం తబితా అశ్రమంలోని పిల్లలకు చలి స్వెటర్లు,నూతన వస్త్రాలను పంపిణి చేశారు.తబితా అశ్రమంలోని పిల్లల మద్య కేక్ కట్ చేసి కూతురు పుట్టిన రోజు ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ..సంపాదించడమే కాకుండ మానవీయ కొణంతో ఆలోచించి ప్రతి ఒక్కరు అశ్రమాలకు అండగా నిలవలన్నారు.అందరిని కోల్పోయి ఈ భూమి పై ఒంటరి జీవణం కొనసాగిస్తున్న వారికి అండగా నిలిచి మేమున్నామని భోరోసా కల్పించాలని అన్నారు.అనంతరం అశ్రమంకు రూ 50 వేలు అందజేశారు.కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు భూక్య విమల వీరేందర్ , మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్, పెంట రాజేష్, అనిత క్రాంతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు