బాల్య వివాహాలను అరికట్టాలి
పెద్దపల్లి,ఇట్స్ ట్రూ న్యూస్
బాల్య వివాహాలను అరికట్టాలి, ఆడపిల్లల పై వివక్షత చూపవద్దని బాల్య వివాహ నిషేధ చట్టం, సఖి సేవలు, అనీమియా, అత్యవసర సమయo లో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్లు తెలుసుకోవలని మహిళ సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు.పెద్దపల్లి జిల్లాలోని మదర్ తెరెసా ఇంజినీరింగ్ కాలేజీ లో మహిళా సాధికరత కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో యొక్క ముఖ్య ఉద్దేశం వివరిస్తు బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. ఆడపిల్లల వివక్షత చూపవద్దని బాల్య వివాహ నిషేధ చట్టం, సఖి సేవలు, అనీమియా, అత్యవసర సమయo లో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్లు తెలుసుకోవలన్నారు. ఉన్నత విద్య , స్కోర్షిప్స్ మరియు విద్యార్థులు అన్ని రంగాలల్లో ముందు ఉండాలి చెప్పారు. కెంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల ను అవగహాన కల్పిస్తు,పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సాధికారత జెండర్ స్పెషలిస్టులు జే. సూచరిత, సి.హెచ్ స్వప్న, ఫైనాన్షియల్ లిటరసీ ఎస్. సంధ్య, సఖి కోఆర్డినేటర్ డి. స్వప్న, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి, చిల్డ్లైన్ సభ్యులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.