బాధిత కుటుంబానికి శ్రీ సీతారామ సేవాసమితి చేయూత..
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత
ఎన్టిపిసి స్థానిక రెండవ డివిజన్ పీకే రామయ్య క్యాంపులో నివాసం ఉంటున్న శివాని భర్తను కోల్పోయి ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి పిల్లల తోపాటు వృద్దురాలైన అత్తమ్మ తో ఉంటున్నారు. వారి కుటుంబ దీన స్థితిని చూసి స్పందించిన శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ శ్రీనివాస్ 1500, కార్తిక్ అనంతపూర్ 1000 రూపాయలు, సీతారామ సేవా సమితి 1000 రూపాయలు సభ్యుల సహకారంతో ఆదివారం రోజు బియ్యం రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారి ఇల్లు కూడా దయనీయంగా ఉంది వారికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇంటికి సిమెంట్ ప్లాస్టింగ్ చేపిస్తే బాగుంటుందని గోలివాడ చంద్రకళ దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రూపు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కంది సుజాత, మేడి సుభద్ర, మందల రమాదేవి, మెడగొని స్వప్న, సరిత, లక్ష్మి, బిల్ల శ్రీదేవి, సిరికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.