చెప్పింది చేయడమే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్టయిల్
జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
స్వార్థం లేకుండా నిబద్ధత తో పని చేస్తే విజయం సాధించవచ్చని రామగుండం ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరోసారి నిరూపించారని జిల్లా అధికార ప్రతినిధి బెంద్రమ్ రాజీ రెడ్డి పేర్కొన్నారు.ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రామగుండం కార్పొరేషన్ ను రూడా చేస్తా అని మాట ఇచ్చి నిరూపించుకున్నాడని, చెప్పింది చేయడమే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్టెయిల్ అని రాజీ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రూడ రావడం తో రామగుండం కు భారీ నిధులు తో పాటు,రామగుండం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.ప్రజల తరుపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.