కాపర్ వైర్ అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
గత కొంత కాలంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధి గ్రామ శివారుల లోని ట్రాన్స్ ఫార్మర్ లలో ని కాపర్ వైర్ ను దొంగతనం చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలను గౌతమి నగర్ సెంటర్ వద్ద ఎన్టీపీసీ పోలీసులు చాక చాక్యంగా పట్టుకొని అరెస్ట్ చేశారు.శనివారం గోదావరిఖని ఏసిపి లో ఏసీపీ మడత రమేష్,రామగుండం సిఐ అజయ్ బాబు వివరాలు వెల్లడించారు.గోదావరిఖని కి చెందిన గుర్రాల చంటి,గుర్రాల మనోజ్,గుర్రాల సుధకార్,గుర్రాల రాజేష్,కోట వంశీ,కోట రాజశేఖర్,కోట సంతోష్ అనే యువకలు జల్సాలకు అలవాటు పడి గ్రామ శివారు వ్యవసాయ భూముల ప్రాంతంలో పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రి చోరి కి పాల్పడేవారని తెలిపారు.ఎన్టీపీసీ పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై ఉదయ్ కిరణ్, గోదావరిఖని డివిజన్ క్రైమ్ టీం , తన సిబ్బంది తో గౌతమినగర్ సెంటర్ వద్ద వాహానాలు తనిఖీ చేస్తుండంగా అనుమాదస్పద ట్రాలీని గుర్తించి విచారించగా 100 కేజీల కాపర్ వైర్ దొంగతనం చేసి తీసుకొని వెళ్తున్నట్లు నిందితులు తెలపడంతో వారి పోలీసులు వెంటనె అదుపులో తీసుకొన్నారు.వారిని పూర్తిగా విచారించగా దొంగలించిన సోత్తును గోదావరిఖని లోని విజయ్ సింగ్,ఎల్లేష్ తో పాటు గుర్తు తెలియని ఇనుపసామాను కొనే వారికి అమ్మి సోమ్ము చేసుకొని జల్సాలు చేసేవారిని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.నిందితులను పట్టకోవడంలో శ్రమించిన రామగుండం సిఐ అజయ్ బాబు,ఎస్సై ఉదయ్ కిరణ్ ,కానిస్టేబుల్స్ మల్లీ కార్జున్,టి అంజయ్య,దూబాసి రమేష్, జే రమేష్ లను ఏసిపి అభినందించి రివార్డులు అందజేశారు.