శివ కేశవ టెంపుల్ నిర్మాణంకు డిప్యూటి మేయరకు ఏలాంటి సంబంధం లేదు
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
శివ కేశవ టెంపుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించ నున్న టెంపుల్ నిర్మాణంకు రామగుండం మున్సిపల్ డిప్యూటి మేయర్ అభిషేక్ రావు కు ఎలాంటి సంబంధం లేదని కార్పోరేటర్లు క్రిష్ణ వేణి,రమణ రెడ్డి,బిఆర్ ఎస్ ఎన్టీపీసీ పట్టణ ఇంచార్జీ అధ్యక్షుడు బుర్ర శంకర్ గౌడ్ అన్నారు.మంగళవారం ఎన్టీపీసీ క్రిష్ణ నగర్ లోని ప్రవేట్ లాడ్జీ లో జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.టెంపుల్ భూమి పూజ చేస్తునమని ట్రస్టు సభ్యుల ఆహ్వాణం మేరకు కాలని వాసుడిగా అభిషేక్ రావు టెంపుల్ స్థలం వద్ద కు వెళ్ళాడని అన్నారు.ట్రస్టు సభ్యుల పై ,అభిషేక్ రావు కుటుంబ సభ్యుల పై పెట్రోల్ చల్లి భయ బ్రాంతులకు గురి చేసిన హత్య యత్నం కు పాల్పడ్డ వ్యక్తి పై హత్య యత్నం కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.రామగుండం రెండో పౌరుడుగా,కాలని వాసుడిగా అక్కడికి వెళ్ళినందుకు రాజకీయ పరంగా డిప్యూటి మేయర్ ను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదన్నారు.ప్రజల ఓట్ల తో గెలచిన కార్పోరేటర్లకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వకుండ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు వ్యవహిరించడం బాధకరమన్నారు.హత్య యత్నం కు పాల్పడ్డ వ్యక్తి పై హత్య యత్నం కేసు నమోదు కాకుంటే న్యాయం కోసం ఎక్కడికైన వెళ్ళడానికి సిద్దమని హెచ్చరించారు.టెంపులు సమస్యను పార్టీలకు,వ్యక్తులకు ముడి పెట్టద్దని అన్నారు.కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ వ్యక్తుల పై దూకుడు తగ్గించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని అన్నారు.కార్యక్రమంలో ఈదునూరి శంకర్,ఈదునూరి పర్వతాలు,కంకటి రవి గౌడ్,సంధ్య రెడ్డి,రాంపెల్లి శ్రీనివాస్ తది తరులు ఉన్నారు.