గ్రూప్–1 అధికారినవుతాను..ప్రజా సేవ చేస్తాను..!
–సిరబోయిన మనీషా, నర్రాశాలపల్లె, ఎన్టీపీసీ రామగుండ
జ్యోతినగర్:, ఇట్స్ ట్రూ న్యుస్
గ్రూప్–4 ఫలితాల్లో రామగుండం కార్పోరేషన్ ఐదో డివిజన్ నర్రాశాలపల్లెకు చెందిన సిరబోయిన మనీషా వార్డు అధికారిణిగా ఎంపికయ్యారు. నర్రాశాలపల్లెకు చెందిన సిరబోయిన శంకర్–పుష్పలత దంపతుల రెండో కుమార్తె మనీషా ఇంటర్ వరకు గోదావరిఖనిలో విద్యనభ్యసించారు. హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కళాశాలో డిగ్రీలో స్టాటిటిక్స్, పీజీ ఉస్మానియాలో విద్యనభ్యసించింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతూనే పోలీస్ నియామకాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉంది. గ్రూప్–1 పరీక్ష రాసి మెయిన్స్‌కు సైతం అర్హత సాధించింది. గ్రూప్–4 ఫలితాల్లో వార్డు అధికారిగా ఎంపికైంది. తండ్రి సిరబోయిన శంకర్ ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్క శిరీషా ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. తమ్ముడు అభిషేక్ హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నాడు. హైదరాబాద్‌లో చదువుకుంటూనే ప్రిపేర్ అయ్యాను. గ్రూప్–1లో ఎంపికై ప్రజా సేవ చేస్తాను అని సంతోషంగా తెలిపారు.