:ఇట్స్ ట్రూ న్యూస్:
జనక్ ను సన్మానం చేసిన బాబర్ సలీం పాష
ఇట్స్ ట్రూ న్యూస్ /జ్యోతినగర్:
తెలంగాణ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ కార్పోరేషన్ చైర్మన్ గా ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ను నియమించారు.ఆదివారం తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వుల్ వెలువడ్డాయి. ఈమేరకు ఐఎన్టీయూసి జాతీయ కార్యదర్శి,ఎన్బీసి మెంబర్,ఎన్టీపీసీ ఉద్యోగుల ఫేడరెషన్ నేషనల్ ప్రెసిడెంట్ బాబర్ సలీం పాష నివాసంలో జనక్ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఐఎన్టీయూసి యూనియన్ అనుబంధ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ కాకర్ల వెంకటస్వామి,జనరల్ సెక్రటరీ బండారి కనుకయ్య,నాయకులు కందుల స్వామి,ఆరపల్లి రాజేశ్వర్,తది తరులు ఉన్నారు.