జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గా బాధ్యతలు చేపట్టిన రాంచందర్
జ్యోతినగర్/ ఇట్స్ ట్రూ న్యూస్:
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కి చెందిన వడ్డేపల్లి రాంచందర్ జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గా మంగళవారం డిల్లీలోని లోక్ నాయక్ భవన్ ఆఫీసులో పదవి బాధ్యతలు చేపట్టారు.భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ఉత్తర్వూల మేరకు ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి మాత్రమే, రామగుండం పారిశ్రామిక ప్రాంతం వ్యక్తి కి ఈ అవకాశం దక్కడం పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలోని ఎన్టీపీసీ,సింగరేణి,ఆర్ ఎఫ్ సిఎల్ లోని సంఘటిత,ఆసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాని ఎస్సీ కమిషన్ మెంబర్ తెలిపారు.కార్యక్రమంలో ఎన్టీపీసి అడిషనల్ ఎన్బిసి మెంబర్ రామనాథ్ గణేష్,మాజీ ఎస్ సి కమీషన్ సభ్యులు కె. రాములు, రామగుండం ప్రాంతం బిజెపి నాయకులు రావుల రాజేందర్, బాస్కర్ రెడ్డి, సాగర్ రాజు, తోటవేణు, గాలిపెళ్లి తిరుపతి, వడ్డెపల్లి శంకర్ తది తరులు ఉన్నారు.