:ఇట్స్ ట్రూ న్యూస్:
కన్నుల పండుగగా శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం
ఇట్స్ ట్రూ న్యూస్ /రామగుండం
శ్రీ మొర్మూర్ కొమురన్న “జాతర” లో శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం ను పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మొర్మూర్ గ్రామశివారులోని శివాలయంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ మేడలాదేవి కేతమ్మ సహిత శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవము గోపు వంశీయులైన యాదవ కుటుంబము 64 సంవత్సరాలుగా జాతరను విజయవంతముగా నిర్వహిస్తున్నారు. శ్రీ గోపు కొమురయ్య అనే అతను సమాజంలో జరిగే శుభాలు,ఆశుభాలు ముందుగా గ్రహించి భవిష్య వాణి రూపంలో చేప్పేవారు.అతనికి పూనకం వచ్చి భవిష్యత్త్ లో జరగబోయో విషయాలను చెప్పడంతో చూట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అతనిని దేవుడని నమ్మేవారు. తన చావును ముందుగానె గ్రహించి సజీవ సమాధి అయ్యి ప్రతి ఏటా జాతర జరపలని గోపు వంశీయులకు చెప్పారు.దీంతో గోపు వంశీయులు గుడిలో ప్రతి రోజు దీపం పెడుతూ గత 64 సంవత్సరాలుగా జాతర నిర్వహిస్తున్నారు.భక్తుల కోరిన కోరికలు నేరవేరుతు ఉండటంతో ప్రతి ఏటా భక్తు రద్ది పెరుగుతుంది.దీనికి అనుగుణంగా భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండ ఏర్పాట్లు చేస్తున్నారు.ఎంతమంది భక్తులు వచ్చిన అన్నదానం కూడ చేస్తున్నారు.కోరిన కోరికలు నేరవేస్తున్న మొర్మూర్ కొమురన్న ను దర్శించుకోవాలని గోపు వంశీయులు కోరారు.ప్రతి ఏటా గోపు ఐలయ్య ఆధ్వర్యంలో జాతర ను ఘనంగా నిర్వహిస్తున్నారు.