కవితలు తెరచాపల మనిషి జీవితాన్ని మారుస్తాయి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
సముద్రంలో పడవ గమ్యం మార్గం చేరాలంటే తెరచాప ఎంతో అవసరమో ఒక్క మనిషి గమ్యాన్ని గుర్తు చేసేది కవులు,కవితలు తెరచాపల మనిషి జీవితాన్ని మారుస్తాయని ఉదయ సాహీతి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య అన్నారు.ఎన్టీపీసీ మజ్దూరి యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని జ్యోతిక రిక్రియోషన్ క్లబ్ లో జ్యోతికిరణాలు వచన కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించారు.చినిగిన చోక్కాయిన తోడుక్కో ఒక మంచి పుస్తం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం అన్న మాటలు గుర్తు చేశారు.పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞాన్ని మోరుగు పరుచుకోవచ్చని అన్నారు.పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోంటె జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సూచించారు.ఒక మంచి పుస్తకం మొదటి సారి చదివితే ఒక కొత్త స్నేహితున్ని పోందినట్టు ఉంటుందన్నారు.గన్ కంటే కలం గోప్పదని పులువురు కలం గోప్పతనంను తేలియజేశారు. ఎన్టీపీసీలో ఉద్యోగ విరమణ తర్వాత సమాజానికి ఉపయోగపడే అంశాలతో కవితా సంకలాన్ని పుస్త కంగా రూపొందించిన కవులు మంచికట్ల లక్ష్మణ్, నాగభూషణాచారి, రాములు ఎడెల్లి, నగునూరి రాజన్న ను పలువురు అభినందించారు,అనంతరం శాలువతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ప్రముఖ కవి, వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్, ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి బండారి కనకయ్య, అడిషనల్ జనరల్ సెక్రటరీ కందుల స్వామి, జ్యోతిక క్లబ్ సెక్రటరీ రాజనర్సయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఇన్చార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమల సురేందర్, ప్రధాన కార్యదర్శి సట్టు ముత్యాలు, చెప్యాల శ్రీపతిరావు, రాంనారాయణ, దుర్గం నర్సయ్య, లాలయ్య తది తరులు పాల్గొన్నారు.