:ఇట్స్ ట్రూ న్యూస్ :
లాడ్జీ ల్లో అకస్మిక తనిఖీలు
ఇట్స్ ట్రూ న్యూస్/ జ్యోతినగర్:
రామగుండం పోలీసు కమిషనరేట్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు,ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ తో కలిసి ఎన్టీపీసీ ప్రాంతంలోని పలు లాడ్జీల్లో అకస్మిక తనిఖీలు మంగళవారం రాత్రి చేశారు.లాడ్జీ ల్లోని రికార్డులను పరిశీలించారు.లాడ్జీ ల్లో ఉన్నవారు ఎందుకున్నారో వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డులను చెక్ చేశారు.లాడ్జీ లో చట్టవిరుద్ద పనులకు పాల్పడిన,అనుమానస్పదంగా కనబడిన వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని యజమానులకు సూచించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల దృష్ట్య ఉన్నత అధికారుల అదేశాల మేరకు లాడ్జీలు తనిఖీలు చేసినట్లు తెలపారు.కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.