మాలల సింహ గర్జన సభ సక్సెస్

Written by itstruenews.com

Published on:

  1. మాలల సింహ గర్జన సభ సక్సెస్

ఇట్స్ ట్రూ న్యూస్, జ్యోతి నగర్ :

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన మాలల సింహ గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని మాల సంఘం లీడర్ కోడం ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మాల జాతికి కలిగే నష్టాన్ని గమనించి ప్రతి ఒక్క మాల సోదరుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణ మాల జాతికి నష్టం కలుగుతుందని అన్నారు. కేంద్రంలో ఉండే బిజెపి ప్రభుత్వం మాలలకు అన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యతిరేక శక్తులతో మాలలంతా ముక్తకంఠంతో ఎదిరించాలని అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం,మర్రిపల్లి గూడెం మాల జాతి కి చెందిన వారు, మాలల సింహ గర్జన సభ కు అధిక సంఖ్యలో హాజరై సభ సక్సెస్ లో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్పారు.కార్యక్రమంలో చేనుమల్ల సాంబ రాజ్, తాడేం నాగ రాజ్, తాడేం రాజేందర్,సదువాలా సాంబ రాజు, చేనుమల్ల సాయిలు, కోడెం లాలయ్య, సదువాలా మొగిలి తది తరులు పాల్గొన్నారు.

Leave a comment