మేడిపల్లి గ్రామ అభివృద్ధి కోసం డీజిఎం కు వినతి
జ్యోతి నగర్, ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ మేడిపల్లి గ్రామ అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు లింగమూర్తి, మామిడాల రాజేశం ఆధ్వర్యంలో ఎన్ టి పి సి సిఎస్ఆర్ సిడి డీజిఎం ను కోరారు. ఈ మేరకు శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో డీజీఎం ప్రవీణ్ కుమార్ చౌదరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ఎన్టిపిసి ప్రభావిత గ్రామమైన మేడిపల్లి గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. మేడిపల్లి గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు, చీకటిలో మగ్గుతున్న గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటుతో పాటు ,పాత రోడ్ల ను మరమ్మతులు, చేయాలన్నారు. ఇటివల కురిసిన బారి ఈదురుగాలుల వల్ల ఇళ్ల పై కప్పులు ఎగిరిపోవడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు, దీంతో ఎన్టిపిసి యాజమాన్యం చొరవ తీసుకొని నష్టపోయిన వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.