నాలుగు చట్టాలతో కార్మికులకు అన్యాయం జరుగుతుంది
జ్యోతి నగర్ :ఇట్స్ ట్రూ న్యూస్ .
కేంద్రం లోని బిజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చడం ద్వారా కార్మికులు అన్యాయం కు గురవుతారని హెచ్ ఎం ఎస్ జాతీయ కార్యదర్శి ,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి సుదర్శన్ రావు అన్నారు.శనివారం ఎన్టీపీసీ లోని ఒక ప్రవేట్ హోటల్ లో హెచ్ ఎం ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమవేశం ను నిర్వహించారు,ఈ కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.నాలుగు చట్టాలు మార్చే ముందు,అమలు చేసే ముందు యూనియన్ నాయకులతో చర్చించ లేదని ఆరోపించారు. కనీస వేతనాలను సంవత్సరం కు ఒక సారి పెంచాలని అన్నారు.కార్మికులను పట్టించుకునే ప్రభుత్వాలు కరువైనాయని అన్నారు.కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్క కార్మికుడు పోరాడటానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ నాయకులు ఉపేందర్,నర్సయ్య,కుమార్,రామరావు,శ్రీనివాస్,