నీటిని పోదుపుగా వాడాలి

Written by itstruenews.com

Published on:

ఇట్స్ ట్రూ న్యూస్

 

నీటిని పోదుపుగా వాడాలి

:ఇట్స్ ట్రూ న్యూస్:

ప్రతి ఒక్కరూ నీటి విలువను తెలుసుకొని పోదుపుగా వినియోగించుకోవాలని రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఎక్స్ క్యూటీవ్ డైరెక్టర్( ఈడీ) కేదార్ రంజన్ పాండ్ అన్నారు.శుక్రవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రాజెక్ట్ టౌన్ షిప్ లో దినోత్సవ వేడుకలను జెండా ఊపి ప్రారంభించారు.ఉద్యోగులతో కలిసి నీటి పోదుపు పై టౌన్ షిప్ లోని వారికి నడిచి అవగహన కల్పించారు.ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తామని టౌన్ షిప్ వాసులతో,ఉద్యోగులతో నీటి ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ..ఇంటింటికీ ఇంకుడు గంతల నిర్మాణం చేసుకోవాలని సూచించారు.చెట్లను విరివిగా పెంచడం ద్వారా వర్షాలు పడాతయన్నారు.నీటి దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ కు క్విజ్,డ్రాయింగ్,ప్రదర్శనలు చేపట్టారు.కార్యక్రమంలో ఉద్యోగులు,టౌన్ షిప్ వాసులు తది తరులు పాల్గొన్నారు.

Leave a comment