డయాలసిస్ పేషంట్ కు నిత్యావసర సరుకుల పంపిణీ
జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం కార్పొరేషన్ పరిది లోని 39వ డివిజన్ కు చెందిన డయాలసిస్ పేషంట్ సుధాకర్ కు గత 4నెలలుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి బెండ్రం రాజిరెడ్డి తెలిపారు.శనివారం 2వేల విలువ గల నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.కార్యక్రమంలో యువజన అధ్యక్షులు ఆసీఫ్ ఖాన్,యువజన విభాగం నాయకుడు పల్లె హరీష్ రెడ్డి,ప్రగతి నగర్ ఇన్చార్జి కదాస్ కుమార్,విఘ్నేశ్వర నగర్ ఇన్చార్జి అశోక్ కుమార్,మహిళా నాయకులు సీతమ్మ ,సుమలత, చింటూ తది తరులు పాల్గొన్నారు.