:ఇట్స్ ట్రూ న్యూస్:
ఎన్టీపీసీ ని సందర్శించిన కేంద్ర కోల్ మైన్స్ అడిషనల్ సెక్రటరీ
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని ఎన్టీపీసీ ,తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ను కేంద్ర బొగ్గుగనుల శాఖ అడిషనల్ సెక్రటరీ విష్మిత తేజ్ సోమవారం సందర్శించారు.ప్రాజెక్ట్ ఎక్స్ క్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ) కేదార్ రంజన్ పాండు, అడిషనల్ సెక్రటరీ కి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.ప్రాజెక్ట్ ఈడీ,జిఎం లతో కలిసి తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ లోని బాయిలర్,కంట్రోట్ రూం,ట్రాక్ హాపర్,ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోని 100 మోగా వాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను సందర్శించారు.93 మీటర్స్ ఎత్తు నుంచి ప్రాజెక్ట్ లోని వివిధ విభాగాల సంస్థల పనితీరును ఏరియల్ ద్వారా చూశారు.రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో సంస్థ పనితీరను ఆమె ప్రశంసించారు.సింగరేణి నుంచి వస్తున్న బొగ్గు దాని నిర్వహన అన్ లోడింగ్ వంటి అంశాలను అధికారులతో చర్చించారు.ఎన్టీపీసీ,ఎస్ సిసిఎల్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి బొగ్గు నిల్వలు,రవాణా విక్రయలావాదేవీ ల పట్ల రెండు సంస్థ లు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి అని సూచించారు.అనంతరం ప్రాజెక్ట్ లో మొక్కలు నాటారు.కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్ వి కె శ్రీనివాస్, ప్రదీప్త కుమార్ మిశ్రా ఎస్ సిసిఎల్ ఈడీఎఫ్ ఎం, సంస్థ జిఎంలు ,ఉన్నత అధికారులు తది తరులు పాల్గొన్నారు.