సమ్మక్క సారలమ్మ జాతరకోసం రూ. 50లక్షలు అందజేత
జ్యోతినగర్ ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం నియోజకవర్గం లో ని గోలివాడ,గోదావరిఖని(జనగాం) లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకోసం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ నుంచి నిధులు మంజూరు చేశారు.గురువారంప్రాజెక్ట్ ఎగ్జీక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ) కేదార్ రంజన్ పాండు ప్రాజెక్ట్ సిఎస్ ఆర్ నిధుల నుంచి రూ.50లక్షలు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ కు అందజేశారు.ప్రాంత అభివృద్ధి,జాతరలో పరిశుభ్రత,లైటింగ్ వంటి ఏర్పాట్ల కోసం గోలివాడ కు 30లక్షలు,జనగాం కు20 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ,ఎమార్వో లు కుమార స్వామి, బండి ప్రకాష్, ఎన్టీపీసీ ఉన్నత అధికారులు దీపక్ పాటక్,విజయ్ కుమార్ సిగ్ధర్,ప్రశాంత్ శ్యాముల్ తది తరులు ఉన్నారు.