జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని దీప్తి మహిళ సమితి భవనం లోని 56వ పోలింగ్ బూత్ లో సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ దంపతులు వడ్డేపల్లి రాంచందర్,రాధ ఓటు వేశారు.ఓటు హక్కు వినియోగించుకొన్న తరువాత ఎస్సీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ…భారత రాజ్యంగం కల్పించిన ఓటు ను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఓటు హక్కు అనేది సామాన్యూని వజ్రాయుధమని పేర్కొన్నారు.మంచి ప్రభుత్వం ను ఏర్పాటు చేసుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకోవడం సరైన అవకాశమన్నారు.కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎన్టీపీసీ ఉద్యోగులు సాగర్ రాజు,సత్యనారాయణ రెడ్డి తది తరులు ఉన్నారు.