రామగుండం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ఎమ్మెల్యే ధ్యేయ
జ్యోతి నగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
రామగుండం నియోజకవర్గము లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అహర్నిషల్ శ్రమిస్తున్నారని ఎన్టిపిసి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా అన్నారు. బుధవారం కృష్ణ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పవర్ ప్రాజెక్టు స్టేజ్ టు రామగుండం ఎన్టీపీసీ లో 24 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు రాష్ట్ర కాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఆసిఫ్ పాష హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందని భావించారు.విద్యుత్ సంస్థలు కూడా స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.రామగుండంకు రుడా రావడం ద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. రామగుండం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు,మెరుగు లింగ మూర్తి,భారత్ గౌడ్,అబ్దుల్లా, ఈదునూరి రవి,సదానందం,తది తరులు పాల్గొన్నారు.