సమస్యలు పరిష్కరించడని వినతి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం మున్సివల్ కార్పోరేషన్ మల్కపూర్ 5వ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణా శ్రీకి సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మొహ్మద్ రహీమ్ వినతి పత్రం అందజేశారు. ఎన్.టి.పి.సి. టౌన్ షిప్ నుండి వచ్చే మురుగు నీటి కాలువ వలన శ్రీనగర్ కాలనీలో మెయిన్ రోడ్డు మీద వర్షకాలంలో నీరు నిలిచి, ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ యొక్క కాలువను పూడిక తీసి నాళకు ఇరువైపులా రాతితో కట్టించి బ్రిడ్జి ఎత్తు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టిపిసి పునరావాస గ్రామము అయిన నర్రాశాలపల్లి గ్రామము ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయి ప్రజలకు అనేక ఇబ్బందులు గురిఅవుతున్నారు. కావున ఎస్ బిఐ బ్యాంక్ నుంచి నర్రశాలపల్లి గ్రామం వరకు సోలార్ ప్లాంట్ గోడను ఆనుకొని రోడ్డు 40 ఫీట్ల విస్తరణ చేసి లెడ్ లైటింగ్ రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేయాలని కోరారు. సుందిల్ల పార్వతీ బ్యారెజ్ బ్యాక్ వాటర్ వలన నష్టపోయిన మల్కాపూర్ (సాయిరాం కాలనీ) ప్రజలకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు నష్టాపరిహారం, పంట నష్టపోతున్న మల్కాపూర్ గ్రామ రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి బ్యాక్ వాటర్ రాకుండా గోదావరినదిపై కరకట్ట నిర్మించి, బ్యాక్ వాటర్ వచ్చె కాలువలను డైవర్షన్ చేయలని విజ్ఞప్తి చేశారు.
hi