ఎస్సీ,ఎస్ టీ ఉద్యోగుల ప్రమోషన్ల కోసం కృషి చేస్తా

Written by itstruenews.com

Published on:

                           ఇట్స్ ట్రూ న్యూస్:

ఎస్సీ,ఎస్ టీ ఉద్యోగుల ప్రమోషన్ల కోసం కృషి చేస్తా

జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్ :

ఎన్టీపీసీ సంస్థ లో పని చేస్తున్న ఎస్సీ, ఎస్ టి ఉద్యోగుల అర్హత మేరకు ప్రమోషన్లు వచ్చేట్లు కృషి చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రాంచందర్ అన్నారు.శనివారం ఎస్సీ ,ఎస్ టీ ఉద్యోగులకు కమిషన్ మెంబర్ , భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ, ఎన్ సి ఎస్ సీ డైరెక్టర్,జి. సునీల్ కుమార్ బాబు, తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రమోషన్ల విషయంలో షెడ్యూల్డ్ క్యాస్టు ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఆ సంస్థ పై చర్యలు తీసుకోంటామని తెలిపారు.ఉద్యోగులు తమ సమస్యలను కమిషన్ మెంబర్ కు విన్నవించారు.అనంతరం రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ లో ఎస్సీ కమ్యూనిటి రిజర్వేషన్ల అమలు పై ప్రాజెక్ట్ ఈడీ ఎక్స్ క్యూటీవ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు తో కమిషన్ మెంబర్ సమీక్షించారు. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాంతాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని సిజిఎం హామీ ఇచ్చారు.ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు కమిషన్ మెంబర్ ను కలిసి తమ సమస్యల పై వినతి పత్రం అందజేసి ఆయనను సన్మానించారు.కార్యక్రమంలో ఎస్సీ ఎస్ టీ ఉద్యోగులు,ఉన్నత అధికారులు తది తరులు ఉన్నారు.

Leave a comment