సీతారాముల కోసం గోటీ కోటీ తలంబ్రాల తయారు
ఇట్స్ ట్రూ న్యూస్,జ్యోతినగర్:
భద్రచలం శ్రీ సీతారాముల కళ్యాణం కోసం వడ్లను గోటీ తో ఒలిచిన కొటీ తలంబ్రాలను ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామ శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు తయారు చేశారు. భూపాల పల్లి చెల్పూర్ గ్రామంలో రామదాసు తిరుపతి తిరుపతమ్మ దంపతులు పండించిన వడ్లును పూజ చేసి శనివారం భక్తులకు పంపించారు.ఒలిచిన తలంబ్రాలను రామదాసు భక్త మండలి వారు పూజ చేసి భద్రచలం ఆలయకమిటి ఈవో కు అందజేస్తారు.సీతారాముని కల్యాణంకోసం ఈ తలంబ్రాలు వాడుతారు.కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కంది సుజాత, మడ్డీ అంబికా, గొల్లపల్లి శ్యామల, మేడగోనీ స్వప్న, గొల్లపల్లి విజయ, కమిటీ మహిళలు పాల్గొన్నారు